కరోనా మృతులు ఏ దేశంలో ఎంతమంది?... వివరాలివిగో!

  • చైనాలో వేలమందిని మింగేసిన కరోనా వైరస్
  • ఇతర దేశాల్లోనూ ప్రభావం చూపిస్తున్న మహమ్మారి
  • ఇరాన్ లో 16 మంది, ఇటలీలో 11 మంది మృత్యువాత
కొన్నివారాల కిందటి వరకు కేవలం చైనాకే పరిమితం అనుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అనేక దేశాల్లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. చైనాలో వేలాదిమందిని కబళించిన కరోనా వైరస్ దక్షిణ కొరియా, ఇరాన్ లతో పాటు ఇటలీ వంటి యూరోపియన్ దేశాలను కూడా వణికిస్తోంది. చైనాలో ఇప్పటివరకు 2,715 మంది మరణించారు. కరోనా మృతుల సంఖ్యలో ఇరాన్ రెండోస్థానంలో ఉంది. చైనాలో ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుతుండగా, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల్లో తీవ్రరూపు దాల్చుతోంది.

ఇప్పటివరకు ఇరాన్ లో 16 మంది మృత్యువాత పడ్డారు. ఇరాన్ లో వైద్య ఆరోగ్య శాఖ డిప్యూటీ మంత్రి కూడా కరోనా బాధితులయ్యారు. దక్షిణ కొరియాలో 8 మంది మరణించగా, వైరస్ బాధితుల సంఖ్య 1,146కి పెరిగింది. యూరప్ దేశం ఇటలీ కూడా కరోనా ముప్పు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఇటలీలో 11 మంది చనిపోయారు. ఒక్క మంగళవారం నాడే నలుగురు మరణించడంతో ఇటలీ ప్రజలు భీతిల్లిపోతున్నారు.


More Telugu News