ఢిల్లీలో కొనసాగుతోన్న హింస.. 20కి చేరిన మృతులు.. అమిత్ షా రాజీనామాకు సోనియా డిమాండ్

  • ఈ హింస వెనుక కుట్ర ఉంది 
  • ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ నేతల వ్యాఖ్యలున్నాయి
  • వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు
  • ఇప్పటికీ హింస కొనసాగుతోంది 
ఈశాన్య ఢిల్లీలో చెలరేగుతోన్న హింసలో మృతుల సంఖ్య 20కి చేరింది. 189 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని జీటీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ గౌతమ్ చెప్పారు. ఈ క్రమంలో ఢిల్లీలో హింసపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. 'ఢిల్లీలోని పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం శాఖ మంత్రి బాధ్యత వహించాలి. హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి' అని ఆమె డిమాండ్ చేశారు.  
 
'ఈ హింస వెనుక కుట్ర ఉంది. ఇటువంటి ఘటనలనే ఢిల్లీ ఎన్నికల సమయంలోనూ దేశం యావత్తూ చూసింది. ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, వారిలో భయపూరిత వాతావరణం నెలకొనేలా బీజేపీ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. 72 గంటల్లో 18 మంది మృతి చెందారు. వారిలో హెడ్‌ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ హింస కొనసాగుతోంది' అని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News