జీవీఎల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. కేంద్రం జోక్యం చేసుకోవాలి: కేశినేని నాని
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు
- ఇంతటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదు
- అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు వైసీపీ ప్రభుత్వం యత్నిస్తోంది
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. అమరావతి ఉద్యమాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారని, కేసుల పేరుతో వేధిస్తున్నారని అన్నారు. ఇంతటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని దుయ్యబట్టారు.
రాజధాని అంశం కేంద్రం పరిధిలో లేదంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాజధాని అంశంలో రాష్ట్రానికి ఎంత సంబంధం ఉందో... కేంద్రానికి కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పారు. అమరావతి విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆటోనగర్ లో ఈరోజు అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.