నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు: ఢిల్లీ బీజేపీ నేత కపిల్‌ మిశ్రా

  • నాపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు
  • నేను భయపడను
  • నేనే తప్పు చేయలేదు 
  • సీఏఏకు మద్దతు తెలపడం తప్పుకాదు
బీజేపీ ఫైర్‌ బ్రాండ్ నేత కపిల్ మిశ్రా ఇటీవల ఢిల్లీ పోలీసులకు అల్టిమేటం ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జఫ్రాబాద్, చాంద్‌బాగ్‌లో సీఏఏపై ఆందోళన చేస్తోన్న వారు అక్కడి నుంచి వెళ్లిపోయేలా పోలీసులు చేయాలన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే లోపు రోడ్లను ఖాళీ చేయించాలని హెచ్చరించారు. కొన్ని రోజుల ముందు కూడా 'విద్రోహులను కాల్చిచంపండి' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హింస చోటు చేసుకుంటోంది. దీంతో కపిల్‌ శర్మ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

ఈ విషయంపై కపిల్ శర్మ స్పందిస్తూ తాను ఎలాంటి తప్పూ చేయలేదని సమర్థించుకున్నారు. 'చాలా మంది నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులతో పాటు చాలా మంది నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేను భయపడను.. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు' అని ఆయన చెప్పుకొచ్చారు. సీఏఏకు మద్దతు తెలపడం తప్పుకాదని ఆయన తెలిపారు.



More Telugu News