భూ సేకరణ, భూ సమీకరణలు పేదల కోసమే: ఏపీ మంత్రి బొత్స
- ల్యాండ్ పూలింగ్‌పై విశాఖ వస్తానని చంద్రబాబు అంటున్నారు
- టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు ఆయనకు చెబుతారు
- చంద్రబాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం పోతుంది
టీడీపీ నేతలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ... ల్యాండ్ పూలింగ్‌పై విశాఖ వస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు విశాఖపట్నానికి వస్తే టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో ప్రజలు ఆయనకు చెబుతారని చురకలంటించారు. జిల్లాలో చంద్రబాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం కూడా పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. అప్పట్లో ఇక్కడ పంటలు సమృద్ధిగా పండాయని చెప్పారు. మళ్లీ ఇప్పుడు జగన్ పాలనలో ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం చేస్తోన్న భూ సేకరణ, భూ సమీకరణలు పేదల కోసం మాత్రమేనని అంతేగానీ, గత ప్రభుత్వంలా దోచుకోడానికి కాదని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు వట్టి మాటలు చెప్పడమే కానీ, ఏమైనా పనిచేశారా? అని నిలదీశారు.