రాహుల్‌కు ఏఐసీసీ పగ్గాలు అప్పగించండి : సోనియాకు లేఖ రాసిన తెలంగాణ కాంగ్రెస్ విధేయులు
- ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నాయకత్వం అవసరం
- పార్టీ బలోపేతానికి ఇది మంచి నిర్ణయం అవుతుంది
- నిన్న సమావేశమై మనోభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సీనియర్లు
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం, పార్టీకి జవసత్వాలు అందించాల్సిన తరుణంలో రాహుల్ నాయకత్వం ఎంతో అవసరమని, తక్షణం ఏఐసీసీ పగ్గాలు ఆయనకు అప్పగించాలని కాంగ్రెస్ తెలంగాణ విధేయులు కోరారు. నిన్న గాంధీభవన్‌లో సమావేశమైన కాంగ్రెస్ విధేయులు (లాయలిస్ట్ ఫోరం) ఈ మేరకు నిర్ణయం తీసుకుని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తమ మనసులో మాట తెలియజేస్తూ లేఖ రాశారు.
రాహుల్ గాంధీ నాయకత్వంలోనే పార్టీ బలోపేతం అవుతుందని తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని, త్వరలోనే ఏఐసీసీ సమావేశం ఏర్పాటుచేసి అవసరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఎన్డీఎంఏ మాజీ వైఎస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, ఏఐసీసీ ఓబీసీ సెల్ ఉపాధ్యక్షుడు పి.వినయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్‌రావు, జి. నిరంజన్ తదితరులు హాజరయ్యారు.