30 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్.. అమెరికా హెచ్చరికలు

  • ఇతర దేశాలకు శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్
  • పలు దేశాల్లో మరణాలు నమోదు
  • జాగ్రత్తగా ఉండాలంటూ తన పౌరులను హెచ్చరించిన అమెరికా
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు శరవేగంగా విస్తరిస్తోంది. దాదాపు 30 దేశాలకు ఈ మహమ్మారి విస్తరించింది. ఆస్ట్రియాలోని టూరిస్ట్ హబ్ లోని గ్రాండ్ హోటల్ యూరప్ లో పని చేస్తున్న ఇటాలియన్ రిసెప్షనిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, 108 గదులు ఉన్న ఆ హోటల్ ను మూసేశారు.

ఇటలీలో 280 మందికి కరోనా సోకగా... వారిలో 10 మంది మరణించారు. హాంకాంగ్, సింగపూర్, దక్షిణకొరియా, ఇరాన్ వంటి దేశాల్లో కూడా ఈ వైరస్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో తన పౌరులకు అమెరికా తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప కరోనా ప్రభావం ఉన్న దేశాలకు వెళ్లొద్దని సూచించింది.


More Telugu News