సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • చీరకట్టు గురించి పూజ హెగ్డే 
  • పూరి దర్శకత్వంలో పవన్?
  • కొత్త దర్శకుడితో చైతు, సమంత
 *  చీర కట్టుకోవడం అంటే తనకి చాలా ఇష్టమని చెబుతోంది అందాలభామ పూజ హెగ్డే. 'చీర కట్టుకోవాలని నేను కూడా ఉబలాటపడుతుంటాను. అయితే చీరతో ఓ చిక్కుంది. అది జారిపోతుందేమో అని ఎప్పుడూ భయపడుతూ వుంటాను. అందుకే, ఇంట్లో పూజల సమయంలో తప్ప ఫంక్షన్లకు వెళ్లినప్పుడు మాత్రం కట్టడానికి సాహసించను' అని చెప్పింది పూజ.    
*  ప్రస్తుతం 'పింక్' చిత్రం రీమేక్ లో నటిస్తున్న పవన్ కల్యాణ్ దీంతో పాటుగా క్రిష్, హరీష్ శంకర్ ల దర్శకత్వంలో కూడా మరో రెండు ప్రాజక్టులు చేయడానికి అంగీకరించిన సంగతి విదితమే. ఇదిలావుంచితే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా పవన్ ఓ చిత్రం చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
*  నాగ చైతన్య, సమంత జంట మరోసారి జోడీ కట్టనుంది. ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ వీరికి నచ్చడంతో ఆ ప్రాజక్టుకు ఓకే చెప్పారట. ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ పై నిర్మించడానికి ఈ జంట ప్లాన్ చేస్తోందట.


More Telugu News