ప్రశాంత్ కిశోర్‌పై కుమారస్వామి చూపు.. రెండు దఫాలుగా చర్చలు

  • 2023 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రెడీ అవుతున్న జేడీఎస్
  • ప్రశాంత్ కిశోర్‌తో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించిన కుమారస్వామి
  • సొంతంగా అధికారంలోకి వస్తామని ధీమా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. పలు పార్టీలు ఇప్పటికే ఆయనతో ఒప్పందాలు కుదుర్చుకోగా, ఇప్పుడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సైతం చర్చలు జరుపుతున్నారు. 2023లో జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న జేడీఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది.

ఇందులో భాగంగా ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే రెండు విడతలుగా ఆయనతో చర్చలు జరిపినట్టు స్వయంగా కుమారస్వామే వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రశాంత్ కిశోర్ తమకు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. తాము సొంతంగానే అధికారంలోకి వస్తామని కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News