ఈ రెండు రోజుల్ని నా జీవితంలో మర్చిపోలేను: విందులో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు
- భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలి
- నిన్న నాకు అపూర్వ స్వాగతం పలికారు
- నాకు భారత్ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల అపార గౌరవం ఉంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటిస్తోన్న నేపథ్యంలో ఆయన గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందు ముగిసింది. కాసేపట్లో ట్రంప్ అమెరికాకు బయలుదేరనున్నారు. అంతకు ముందు విందులో ట్రంప్ మాట్లాడుతూ... 'భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలి. నిన్న నాకు అహ్మదాబాద్ లోని మొతెరా స్టేడియంలో అపూర్వ స్వాగతం పలికారు. నాకు భారత్ పట్ల, ఇక్కడి ప్రజల పట్ల అపార గౌరవం ఉంది. భారత్‌లో గడిపిన ఈ రెండు రోజులు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పారు.
కాగా, ఈ విందులో ట్రంప్‌కి ఎడమ వైపున ప్రధాని మోదీ కూర్చున్నారు. ట్రంప్‌కు ఎదురుగా వున్న వరుసలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా కూర్చున్నారు. ట్రంప్‌తో కలిసి పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, అమెరికాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు విందు ఆరగించారు.