ఢిల్లీలో హింస: రేపు కూడా పాఠశాలలన్నీ బంద్
- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో హింస
- నేడు కూడా ఈశాన్య ఢిల్లీలో పాఠశాలలు బంద్
- రేపు జరగాల్సిన సీబీఎస్‌సీ పరీక్షలన్నీ వాయిదా
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతోన్న ఆందోళనల్లో హింస చోటు చేసుకుని దాదాపు 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు కూడా ఈశాన్య ఢిల్లీలోని పాఠశాలలన్నింటినీ మూసి వేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ రోజు ప్రకటన చేశారు. రేపు జరగాల్సిన సీబీఎస్‌సీ పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని బోర్డును తాము కోరినట్లు తెలిపారు.
ఓ వైపు ఢిల్లీలో ట్రంప్ పర్యటిస్తుండగా, మరోవైపు ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగడం కలకలం రేపుతోంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జామియా యూనివర్సిటీ సమీపంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశాన్య ఢిల్లీలోని అన్ని పాఠశాలలకు నేడు కూడా సెలవులు ఇచ్చారు.