అందుకే టీనేజీలోనే తాగుడుకు అలవాటుపడుతున్నారు!: పరిశోధకులు

  • మద్యం అలవాటుపై పరిశోధనలు
  • ఆసక్తికర విషయం కనుగొన్న న్యూయార్క్‌ వర్సిటీ పరిశోధకులు  
  • మద్యం యాడ్స్ టీనేజీ కుర్రాళ్ల తాగుడుకు కారణమని గుర్తింపు
చిన్న వయసులోనే మద్యం అలవాటు చేసుకుని చాలా మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారు మద్యం అలవాటుకు బానిసలుగా మారడం వెనుక ఉన్న కారణాలపై అమెరికాలోని న్యూయార్క్‌ వర్సిటీ పరిశోధకులు ఆసక్తికర విషయాన్ని కనుగొన్నారు.

మద్యం ఉత్పత్తుల యాడ్స్ టీనేజీ కుర్రాళ్లను తాగుడుకు బానిసలుగా మార్చుతున్నాయని తెలిపారు. పొగాకు ఉత్పత్తుల యాడ్స్‌తో  యువతపై పడుతున్న ప్రభావంపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించినట్లు వివరించారు. మద్యం బ్రాండ్‌ల ఆకర్షణీయమైన లోగోలు వంటివి టీనేజీ కుర్రాళ్లను అటువైపుగా ఆకర్షించేలా చేస్తున్నాయని తెలిపారు. మద్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను పట్టించుకోకుండా కుర్రాళ్లు మద్యానికి అలవాటు పడేలా ఈ యాడ్స్‌ చేస్తున్నాయని చెప్పారు.


More Telugu News