సీఏఏ, కశ్మీర్ గురించి డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు దేశ అంతర్గత విషయాలు
- సీఏఏ గురించి నేను ప్రధాని మోదీతో చర్చించలేదు
- భారత్, పాకిస్థాన్ కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇప్పటికే చెప్పాను
- కశ్మీర్ అంశంలో చాలా క్లిష్టమైన అంశాలున్నాయి
దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)తో పాటు, భారత్, పాక్ మధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న కశ్మీర్ సమస్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు దేశ అంతర్గత విషయాలని తేల్చి చెప్పారు. సీఏఏ గురించి తాను ప్రధాని మోదీతో చర్చించలేదని తెలిపారు.
కశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ... ఆర్టికల్ 370 రద్దుపై తాను మాట్లాడేందుకు ఏమీ లేదని ఆయన చెప్పారు. ఇది కూడా భారత అంతర్గత విషయమని స్పష్టం చేశారు. అయితే, భారత్, పాకిస్థాన్ కోరుకుంటే మధ్యవర్తిత్వానికి సిద్ధమని తాను గతంలోనే చెప్పినట్లు ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంలో చాలా క్లిష్టమైన అంశాలున్నట్లు చెప్పారు. తమకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో సత్సంబంధాలున్నాయని చెప్పారు. ఆ దేశం నుంచి ఎదురవుతున్న ఉగ్రవాద సమస్యపై భారత ప్రధాని మోదీ దీటుగా నిర్ణయాలు తీసుకోగలరని తెలిపారు.