వెంటాడుతున్న కరోనా ఆందోళన... స్టాక్ మార్కెట్లకు తప్పని నష్టాలు

  • ఉదయం నుంచి డౌన్ ట్రెండ్ లో సూచీలు
  • బలహీనపడిన ఇంధన, ఆటో మొబైల్, ఫార్మా షేర్లు
  • లాభాల బాటలో ఎస్బీఐ, ఎయిర్ టెల్, టాటా స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లను కరోనా వైరస్ భయాలు వీడడంలేదు. నిన్న భారీగా నష్టపోయిన భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప నష్టాలు చవిచూశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే అనిశ్చితి రాజ్యమేలింది. ఆటోమొబైల్, ఫార్మా, ఇంధన సంస్థల షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. ఎయిర్ టెల్, టీసీఎస్, ఎస్బీఐ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్ షేర్లు ప్రతికూలతలను అధిగమించి లాభాలు అందుకున్నాయి. ఇక, బీఎస్ఈ సెన్సెక్స్ 82 పాయింట్ల నష్టంతో 40,281 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా స్వల్ప నష్టాలతోనే ముగిసింది. 31 పాయింట్ల నష్టంతో 11,797 వద్ద స్థిరపడింది.


More Telugu News