ట్రంప్ భారత్ లోనూ మమ్మల్నే పొగిడాడు... గొప్పలు చెప్పుకుంటున్న పాక్ మీడియా

  • 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం
  • ఉగ్రవాదంపై పాక్ తో కలిసి పనిచేస్తున్నామన్న ట్రంప్
  • ట్రంప్ వ్యాఖ్యలను ఇష్టానుసారం మార్చుకున్న పాక్ మీడియా సంస్థలు
అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనను అంతర్జాతీయ మీడియా ఓ కోణంలో చూస్తుంటే పాకిస్థాన్ మీడియా మాత్రం మరో కోణంలో చూస్తోంది. ట్రంప్ భారత గడ్డపై పాకిస్థాన్ ను పొగిడాడంటూ పాక్ పత్రికలు పతాక శీర్షికల్లో పేర్కొన్నాయి. పాకిస్థాన్ తమకు సన్నిహిత దేశమని ట్రంప్ చెప్పారని ఓ పత్రిక ప్రముఖంగా పేర్కొనగా, ట్రంప్ పాక్ ను ఆకాశానికెత్తేశారని, పాక్ లౌకిక వాదాన్ని కొనియాడారని 'డాన్' ప్రచురించింది.

'ద న్యూస్ ఇంటర్నేషనల్' ఓ అడుగు ముందుకేసి, పాకిస్థాన్ తో భారత్ సంబంధాలు బహు బాగున్నాయని ట్రంప్ చెప్పారంటూ ఓ కథనంలో వివరించింది. వాస్తవానికి 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ చెప్పింది ఏంటంటే... సరిహద్దుల్లో ఉన్న ఉగ్రమూకల నిర్మూలన విషయంలో పాకిస్థాన్ తో కలిసి పనిచేస్తున్నాం అన్నారు. కానీ పాక్ మీడియా సంస్థలు దాన్ని ఇష్టానుసారంగా మార్చుకున్నాయి.


More Telugu News