‘బఫూన్ గ్యాంగ్’తో మా నాయకులను అడ్డుకోమని పంపే దుస్థితికి ‘తుగ్లక్’ చేరిపోయాడు: బుద్ధా వెంకన్న

  • విశాఖలో ల్యాండ్ మాఫియాని ల్యాండ్ చేసేశారు
  • మూడు రాజధానులను ప్రజలు ఛీ కొట్టారు
  • వైసీపీ ‘పెయిడ్ బ్యాచ్’ ని రంగంలోకి దింపారు
మూడు రాజధానులు అంటూ విశాఖలో ల్యాండ్ మాఫియాని ల్యాండ్ చేసేశారంటూ వైసీపీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మూడు ముక్కల రాజధానిని ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఛీ కొట్టడంతో తుగ్లక్ ఉగ్రరూపం దాల్చారంటూ పరోక్షంగా జగన్ పై విరుచుకుపడ్డారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా ‘మ్యాటర్ వీక్’ అయిందని, ఏం చెయ్యాలో అర్థంకాక వైసీపీ ‘పెయిడ్ బ్యాచ్’ ని రంగంలోకి దింపారని, రాళ్లు వేసే 'బఫూన్ గ్యాంగ్' తో టీడీపీ నాయకులను అడ్డుకోమని పంపే దుస్థితికి తుగ్లక్ చేరిపోయాడని తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపైనా మండిపడ్డారు. జగన్ వెనుక ఉండి ‘మీరు రాసిన దొంగ లెక్కలు, వాటాల చిట్టా, జీఓల వెనుక ఉన్న ‘క్విడ్ ప్రో’కో అందరూ చేస్తారనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు.


More Telugu News