ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ వ్యవహారం..క్యాట్​ లో విచారణ

  • ఈ నెల 26కు వాయిదా వేసిన న్యాయస్థానం
  • కనీస విచారణ లేకుండా సస్పెండ్ చేశారు
  • ఇది నిబంధనలకు విరుద్ధమన్న ఏబీ తరఫు న్యాయవాది
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ను ఆయన ఆశ్రయించడంతో ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.

దీనిపై ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్ పై వివరణ ఇస్తూ ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. కనీస విచారణ లేకుండా తనను సస్పెండ్ చేయడం అఖిల భారత సర్వీసు నిబంధనలకు, చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న క్యాట్ ఈ కేసు తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.


More Telugu News