ట్రంప్ సంతకం.. నెటిజన్ల సెటైర్ల వర్షం!
- భారత్ లో కొనసాగుతున్న ట్రంప్ పర్యటన
- కలిపిరాతలో ఉన్న ట్రంప్ సంతకంపై ఆసక్తికర వ్యాఖ్యలు
- పలురకాల కామెంట్లు
భారత్ లో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. తొలి రోజున గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన సమయంలో విజిటర్స్ బుక్ లో తన వ్యాఖ్యలు రాసిన ట్రంప్ సంతకం చేశారు. నిన్న సాయంత్రం ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ ను సందర్శించిన సమయంలోనూ విజిటర్స్ బుక్ లో ట్రంప్ సంతకం చేశారు. ఇవాళ రాజ్ ఘాట్ లో గాంధీ మహాత్ముడి సమాధిని సందర్శించిన సమయంలో అక్కడి విజిటర్స్ బుక్ లోనూ యూఎస్ అధ్యక్షుడు సంతకం చేశారు. ట్రంప్ పర్యటనపైనే కాదు, ఆయన చేసిన సంతకం ఆసక్తిదాయకంగానే ఉంది.
కలిపిరాతలో ఉన్న ట్రంప్ సంతకంపై సామాజిక మాధ్యమాల వేదికగా సెటైర్లు పండుతున్నాయి. ఆ సంతకం ఈసీజీ గ్రాఫ్ లా ఉందని ఒకరు, సిస్మోగ్రాఫ్ లా ఉందని మరొకరు, ఈ సంతకం ప్రిస్క్రిప్షన్ లా ఉందని, కొత్త పెన్ ను కొనేముందు అది సరిగా రాస్తుందో లేదో చెక్ చేసేందుకు ఎలా అయితే రాస్తామో, ఆ సంతకం అలా ఉందంటూ ఎవరికి తోచిన రీతిలో వారు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గేట్–2021లో ఈ ప్రశ్న అడుగుతారేమోనని, మోదీ ఆలింగనం చేసుకున్నప్పుడల్లా ట్రంప్ హార్ట్ బీట్ లా ఉందని, హైదరాబాద్ లోని దుర్గం చెరువు దగ్గర వేలాడుతున్న బ్రిడ్జిలా ఉందేంటంటూ సెటైర్లు కురిపించారు.