ఎల్లో మీడియా డప్పులు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేది: విజయసాయి

ఎల్లో మీడియా డప్పులు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేది: విజయసాయి
  • చంద్రబాబు కమీషన్లు, వాటాల కోసమే చేశారంటూ ఆరోపణలు
  • దోపిడీ వ్యవహారాలు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతున్నాయని వెల్లడి
  • ఇప్పుడు కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపైనా, ఒక వర్గం మీడియాపైనా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జీవో ఇచ్చినా, పర్యటన చేసినా, ప్రతిదీ కమీషన్లు, వాటాల కోసమేనని ఆరోపించారు. ఈ క్రమంలో ఎల్లో మీడియా డప్పులు కొడుతూ బొక్కలు బయటపడకుండా చూసేదని విమర్శించారు.

దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా బయటపడుతుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం అంటే అమరావతికి సంబంధంలేని మహిళలతో దాడులు చేయించడమా? అని ప్రశ్నించారు. ప్రజలు అధికారం నుంచి తొలగించినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర చేయడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? అంటూ నిలదీశారు. ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


More Telugu News