మోదీ పదవిలో ఉన్నంతకాలం పాకిస్థాన్ తో భారత్ క్రికెట్ ఆడడం కష్టమే: అఫ్రిది
- రెండు దేశాల ప్రజలు సరిహద్దులు దాటాలనుకుంటున్నారని వ్యాఖ్యలు
- మోదీ మాత్రం తిరోగమనంలో పయనిస్తుంటారని విమర్శలు
- మోదీ అజెండా ఏమిటో తెలియడంలేదంటూ వ్యాఖ్య
భారత్ ను ఆడిపోసుకోవడమే పనిగా వ్యాఖ్యలు చేసేవాళ్లలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఒకరు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై స్పందించాడు. మోదీ పదవిలో ఉన్నంత కాలం పాకిస్థాన్ తో క్రికెట్ ఆడేందుకు భారత్ ఒప్పుకోకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇరు దేశాల ప్రజలు సరిహద్దులు దాటి సుహృద్భావ సంబంధాలు ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తుంటే, మోదీ తిరోగమనంలో పయనిస్తున్నారని విమర్శించాడు.
"మోదీ అధికారంలో కొనసాగినంత కాలం భారత్ నుంచి పాకిస్థాన్ క్రికెట్ కు ఎలాంటి సానుకూల స్పందన రాదు. మోదీ ఎలా ఆలోచిస్తారో మనందరికీ తెలుసు. అసలింతకీ మోదీ అజెండా ఏమిటో తెలియడంలేదు" అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు పాకిస్థాన్ జట్టు భారత్ కంటే ఎంతో మెరుగ్గా ఉండేది. అయితే భారత్ స్థిరమైన వ్యవస్థలతో క్రీడలతో పాటు అన్ని రంగాలను చక్కదిద్దుకుని ముందుకు వెళ్లగా, పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, దార్శనికత లేకపోవడం వంటి కారణాలతో బాగా వెనుకబడిపోయింది. ముఖ్యంగా పాక్ క్రికెట్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుగా తయారైంది. మరోవైపు భారత్ మాత్రం బలమైన జట్టుగా ఎదిగింది. అఫ్రిదీ లాంటి వాళ్లకు ఇదే కంటగింపుగా తయారైంది.