మహిళల టి20 వరల్డ్ కప్: రసవత్తరంగా భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్
- టాస్ గెలిచిన బంగ్లాదేశ్
- మొదట బ్యాటింగ్ చేసిన భారత్
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగుల స్కోరు
- లక్ష్యఛేదనలో 18 ఓవర్లలో 7 వికెట్లకు 110 రన్స్ చేసిన బంగ్లాదేశ్
టి20 మహిళల ప్రపంచకప్ లో భాగంగా ఆస్ట్రేలియాలోని పెర్త్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసింది. యువ సంచలనం షెఫాలీ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 39 పరుగులు సాధించింది.
మరో విధ్వంసక బ్యాట్స్ ఉమన్ జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులతో రాణించింది. చివర్లో వేదా కృష్ణమూర్తి 11 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు నమోదు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో కెప్టెన్ సల్మా ఖాతూన్, పన్నా ఘోష్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక, 143 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ 18 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది.
తొలి మ్యాచ్ లో ఆసీస్ పరాజయాన్ని లిఖించిన పూనమ్ యాదవ్ మరోసారి స్పిన్ మ్యాజిక్ చేసి 3 వికెట్లు తీసింది. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి 2 వికెట్లతో సత్తా చాటింది. బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 12 బంతుల్లో 33 పరుగులు చేయాలి.