ట్రంప్​ పర్యటన.. తాజ్​ మహల్​ పరిసరాల్లో కోతుల బెడద!

  • కొంచెం సేపట్లో తాజ్ మహల్ ను సందర్శించనున్న ట్రంప్
  • కోతులు లేకుండా చూసేందుకు రంగంలోకి కొండముచ్చులు
  • ఐదు కొండముచ్చులను అక్కడ ఉంచినట్టు సమాచారం
మరో గంట సేపట్లో ఆగ్రాలోని తాజ్ మహల్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) భద్రతను ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తాజ్ మహల్, దాని పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

గత ఆరు నెలలుగా కోతులు ఎక్కువగా ఇక్కడ ఉంటున్నాయని చెప్పారు. సందర్శకుల చేతిలోని వస్తువులను, తినుబండారాలను లాక్కుపోతున్నాయని సందర్శకులు చెబుతున్నారు. ట్రంప్ సందర్శన సమయంలో వీటి నుంచి అసౌకర్యం కలుగుతుందేమోన్న ఆందోళనలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోతుల బెడదను తట్టుకోవడానికి ఐదు కొండముచ్చులను రంగంలోకి దించుతున్నట్టు సమాచారం. ట్రంప్ సందర్శించే సమయంలో ఇతర సందర్శకులు ఎవరినీ అనుమతించరు కనుక కోతులు కూడా అక్కడ ఉండవని సంబంధిత సిబ్బంది అంటున్నారు. 


More Telugu News