ఇరు దేశాల మైత్రీ బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం: 'నమస్తే ట్రంప్‌' సభలో మోదీ

  • ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలి  
  • గుజరాత్‌ మాత్రమే కాదు యావత్ దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోంది
  • ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం స్వాగతం పలుకుతోంది
ఇరు దేశాల మైత్రీ బంధంలో ఇకపై సరికొత్త అధ్యాయం పలుకుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, మోతెరా మైదానంలో  నిర్వహిస్తోన్న 'నమస్తే ట్రంప్' సభలో ఆయన మాట్లాడారు. ఇరు దేశాల మైత్రీ బంధం కలకాలం వర్థిల్లాలని చెప్పారు.
 
గుజరాత్‌ మాత్రమే కాదు యావత్ దేశం ట్రంప్‌కు స్వాగతం పలుకుతోందని మోదీ అన్నారు. అహ్మాదాబాద్‌లోని ఈ స్టేడియం నవచరిత్రకు నాంది పలుకుతోందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోందన్నారు. హ్యూస్టన్‌లో హౌడీ-మోదీ కార్యక్రమంలో నాంది పలికిందని, హౌడీ-మోదీ కొనసాగింపుగానే 'నమస్తే ట్రంప్' జరుగుతుందని తెలిపారు.


More Telugu News