మొతేరాకు ప్రత్యేక అతిథులు... రతన్ టాటా, షారూఖ్, మాధురి, అక్షయ్, కంగనా!
- 18 గంటల పాటు ప్రయాణం చేసిన ట్రంప్
- ఇప్పటికే నిండిపోయిన స్టేడియం
- పలువురు సెలబ్రిటీల హాజరు
దాదాపు 18 గంటల పాటు ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో కాలు పెట్టగా, ఆయన ప్రసంగించే అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం ఇప్పటికే ప్రజలు, ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలతో నిండిపోయింది. పలువురు పారిశ్రామిక వేత్తలు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నారు.
టాటా గ్రూప్ సంస్థల అధినేత రతన్ టాటా స్టేడియంకు చేరుకుని, వేదికనెక్కగా, ప్రజలు కేరింతలు కొట్టారు. ఆపై బాలీవుడ్ స్టార్లు షారూక్ ఖాన్, అక్షయ్, మాధురీ దీక్షిత్, కంగనా రనౌత్ తదితరులు కూడా స్టేడియంలో ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టులో దిగిన ట్రంప్ కు పలువురు స్వాగతం పలుకగా, దాదాపు 22 కిలోమీటర్ల దూరంలోని స్టేడియం వరకూ ఆయన ర్యాలీ జరుగనుంది.