నాయకత్వ సమస్యను పరిష్కరించకుంటే జరిగేది ఇదే: కాంగ్రెస్ నేత శశిథరూర్

  • రాహుల్ పగ్గాలు చేపట్టాలనుకుంటే వెంటనే ఆ పనిచేయాలి
  • లేదంటే కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయాలి
  • ఆలస్యం చేస్తే పార్టీ మనుగడకే ముప్పు
వీలైనంత త్వరగా నాయకత్వ సమస్యను పరిష్కరించాలని, లేదంటే పార్టీకి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ కనుక పార్టీ పగ్గాలను తిరిగి చేపట్టదలచుకుంటే వెంటనే ఆ పనిచేయాలని సూచించారు. ఆయనకు ఇష్టం లేకుంటే కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త నాయకత్వాన్ని సిద్ధం చేయాలని కోరారు. లేదంటే పార్టీ తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, పార్టీ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అన్నారు.

ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సందర్భంగా మురికివాడలు కనిపించకుండా గోడ కట్టడాన్ని తప్పుబట్టిన శశిథరూర్.. యూపీలోని సోన్‌భద్ర జిల్లాలో మూడువేల టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నాయన్న యోగి ప్రభుత్వ ప్రకటనను దుయ్యబట్టారు.


More Telugu News