ఇండియాకు విమానం ఎక్కిన తరువాత... ట్వీట్లు చేసుకుంటూ ట్రంప్ కాలక్షేపం!
- మరికాసేపట్లో అహ్మదాబాద్ కు ట్రంప్
- నిన్న రాత్రి వాషింగ్టన్ లో బయలుదేరిన యూఎస్ ప్రెసిడెంట్
- పలు విషయాలపై ట్వీట్లు
భారత పర్యటనకు బయలుదేరిన తరువాత, వాషింగ్టన్ డీసీలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ ఆపై ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు పంచుకున్నారు. విమానం ఎక్కే ముందు తాను గొప్ప స్నేహితులను కలుసుకోబోతున్నానని ట్వీట్ చేశారు. ఓ చారిత్రాత్మక కార్యక్రమానికి అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుందని వ్యాఖ్యానించిన ట్రంప్, ఆపై అమెరికా రాజకీయ వ్యవహారాలపై పడిపోయారు.
తనకు అనుకూలంగా రిపబ్లికన్ పార్టీ 95 శాతం, 218 మంది ఫెడరల్ న్యాయమూర్తులు, ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు అనుకూలమని ఇదో రికార్డని ట్వీట్ పెట్టారు. దాని ముందు డెమోక్రాట్లు అందరూ ఈ వీడియోను చూడాలంటూ, ఓ నల్లజాతి యువతి చేసిన వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేశారు. దేశ ప్రజలందరికీ తాను ఎంతో మంచిని చేయనున్నానని అన్నారు. జెఫ్ వాన్ డ్య్రూకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. న్యూజర్సీ ప్రజలకు ఆయన చేసినంత సేవ మరే ఇతర రాజకీయ నాయకుడూ చేయలేదని కితాబిచ్చారు. ఈ నెల 29న జరగనున్న 'కేఏజీ 2020' కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు.