న్యూజిలాండ్ తో తొలి టెస్టులో ఘోరంగా ఓడిపోయిన భారత్

  • రెండో ఇన్నింగ్స్ లో 9 పరుగుల లక్ష్యం
  • 10 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
  • లాంఛనాన్ని పూర్తి చేసిన బ్లండెల్, లాధమ్
వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు, తన రెండో ఇన్నింగ్స్ లో 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియా తొలి ఇన్నింగ్స్ 165 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ 191 పరుగులకు పరిమితం కాగా, న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఆపై రెండో ఇన్నింగ్స్ లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా, కేవలం 1.4 ఓవర్లలో ఓపెనర్లు బ్లండెల్, లాధమ్ లు లాంఛనాన్ని పూర్తి చేశారు.

అంతకుముందు నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 148 పరుగుల వద్ద అజింక్య రహానే, హనుమ విహారి వెంటవెంటనే పెవిలియన్ చేరడంతోనే భారత పరాజయం ఖరారైపోయింది. ఆపై అశ్విన్, ఇశాంత్, రిషబ్ పంత్, బుమ్రాలను ఆసీస్ బౌలర్లు పెద్దగా శ్రమ లేకుండానే అవుట్ చేశారు. ఈ విజయంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ పోటీల్లో న్యూజిలాండ్ ముందడుగు వేసింది.


More Telugu News