‘భారతీయుడు-2’ ప్రమాదం విచారణ అధికారిగా డీసీపీ నాగజ్యోతి
- ఈవీపీ స్టూడియోలో ప్రమాదం.. ముగ్గురి మృతి
- కేసు సీబీసీఐడీకి అప్పగింత
- పరారీలో ఉన్న క్రేన్ ఆపరేటర్ అరెస్ట్
ప్రముఖ నటుడు కమలహాసన్ నటిస్తున్న ‘భారతీయుడు-2’ సినిమా షూటింగులో ఇటీవల జరిగిన ప్రమాదంపై విచారణకు రంగం సిద్ధమైంది. చెన్నై శివారులోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో సినిమా కోసం సెట్ వేస్తున్న సమయంలో క్రేన్ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
ఈ ఘటనలో క్రేన్ ఆపరేటర్ రాజన్, లైకా సంస్థ, ప్రొడక్షన్ మేనేజర్‌తోపాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ప్రమాదం తర్వాత పరారైన క్రేన్ ఆపరేటర్ రాజన్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, నటుడు కమలహాసన్, దర్శకుడు శంకర్‌లకు సమన్లు జారీ చేశారు. తాజాగా, ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేసిన అధికారులు విచారణ అధికారిగా డిప్యూటీ కమిషనర్ (క్రైం) నాగజ్యోతిని నియమించారు.