తిరుమలలో కనిపించని రద్దీ... ఒకే కంపార్టుమెంట్ లో భక్తులు!
- విద్యార్థులకు మొదలుకానున్న పరీక్షల సీజన్
- రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం
- మరో నెల రోజులు రద్దీ సాధారణమే
తిరుమలలో సోమవారం ఉదయం రద్దీ గణనీయంగా తగ్గింది. స్వామి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒకే కంపార్టుమెంటులో భక్తులు వేచి చూస్తున్నారు. సర్వ దర్శనంతో పాటు టైమ్ స్లాట్ టోకెన్లు, నడక దారి భక్తుల దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు రెండు నుంచి మూడు గంటల్లోనే దర్శనం పూర్తవుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆదివారం నాడు స్వామిని 88,024 మంది భక్తులు దర్శించుకున్నారని, సుమారు రూ. 3 కోట్ల హుండీ ఆదాయం లభించిందని తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ మొదలు కానున్న నేపథ్యంలోనే కొండపై రద్దీ సాధారణంగా ఉందని, మరో నెల రోజులు ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.