చేతులు శుభ్రం చేసుకోండి పిల్లలూ.. ఢిల్లీలోని గురుద్వారా స్కూళ్లలో సరికొత్తగా ‘పెపె’ రోబో
- పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన కోసం ఏర్పాటుకు నిర్ణయం
- సంక్రమిత వ్యాధుల నుంచి రక్షణకు తోడ్పతుందన్న గురుద్వారా నిర్వహణ కమిటీ
- ఒక్కో రోబోకు ఏడు వేల రూపాయల ఖర్చు
పిల్లల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, సంక్రమిత వ్యాధుల నుంచి రక్షణకు తోడ్పడేలా చేసేందుకు ఢిల్లీలోని గురుద్వారా స్కూళ్లలో సరికొత్తగా మాట్లాడే రోబో ‘పెపె’ను ఏర్పాటు చేయనున్నారు. అమృత విద్యా పీఠం విశ్వవిద్యాలయం సాయంతో గ్లాస్గో వర్సిటీ రీసెర్చర్లు ఈ ‘పెపె’ రోబోను డెవలప్ చేశారు. ఈ రోబోలో మోషన్ సెన్సర్లు, వాయిస్ రికగ్నిషన్ సెన్సర్లు ఉంటాయి. వాటి ముందు నుంచి వెళ్లినప్పుడు గుర్తించి.. చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్తాయి.