ఐదు దశాబ్దాల తర్వాత కనిపించిన అరుదైన నీటి పాము
- ఫ్లోరిడాలో ప్రత్యక్షమైన రెయిన్ బో స్నేక్
- 1969లో తొలిసారి కనిపించిన పాము
- నీట మునిగివుండే వృక్షాల నడుమ జీవించే సర్పం
అమెరికాలో ఓ అరుదైన పాము ఐదు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ కనిపించింది. ఎప్పుడో 1969లో దర్శనమిచ్చిన రెయిన్ బో స్నేక్ తాజాగా ఫ్లోరిడాలోని ఓక్లా జాతీయారణ్యంలో ప్రత్యక్షమైంది. అప్పట్లో ఇది మరియన్ కౌంటీలో కనిపించింది. రెయిన్ బో స్నేక్ పేరుకు తగ్గట్టే అనేక వర్ణాలతో ఉంటుంది. ఇది ప్రధానంగా నీటి పాము. వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా నీట మునిగి ఉండే వృక్షాల మధ్య జీవిస్తుంది. ఫ్లోరిడా మత్స్య, వన్యప్రాణి కన్జర్వేషన్ కమిషన్ ఈ రెయిన్ బో స్నేక్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.