పాక్​ అధ్యక్షుడిని కలిసిన శత్రఘ్న సిన్హా

  • వివాహ వేడుకకు హాజరయ్యేందుకు లాహోర్ వెళ్లిన కాంగ్రెస్ నేత
  • గవర్నర్ హౌజ్ లో పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీతో భేటీ
  • సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందన్న ఇరువురు నేతలు
బాలీవుడ్ దిగ్గజ నటుడు, కాంగ్రెస్ నేత శత్రఘ్న సిన్హా.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీని కలిశారు. ఓ వివాహానికి హాజరయ్యేందుకు లాహోర్ వెళ్లిన శత్రఘ్న.. గవర్నర్ హౌజ్లో ఆరిఫ్ తో భేటీ అయ్యారు.  ఈ సమావేశంలో ఇరు  దేశాల సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాల్సిన అవసరంపై చర్చించినట్టు ఆరిఫ్ ట్వీట్ చేశారు.

ఈ చర్చల్లో ఇతర ఆంశాలతో పాటు కశ్మీర్ ప్రస్తావన కూడా వచ్చినట్టు ఆరిఫ్ కార్యాలయం ప్రకటించింది. ఉపఖండంలో శాంతి పెంపొందించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారని చెప్పింది. కాగా, తాము సాంఘిక, సాంస్కృతిక సమస్యలపై చాలా విషయాలు చర్చించామని, అయితే, తమ మధ్య రాజకీయాల గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని శత్రఘ్న ట్వీట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో విధించిన ఆంక్షాలపై తాను వ్యక్తం చేసిన ఆందోళనను సిన్హా అర్థం చేసుకున్నారని పాక్ అధ్యక్షుడు పేర్కొన్నారు.


More Telugu News