టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో భారీ భూకంపం
- ఎనిమిది మంది మృతి.. పదుల సంఖ్యలో గాయాలు
- శిథిలాల కింద పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయి ఉండొచ్చన్న అధికారులు
- 5.7 తీవ్రతతో కంపించిన భూమి
- కుప్పకూలిన భవనాలు.. రెండు దేశాల్లోనూ భారీగా ఆస్తినష్టం
టర్కీ, ఇరాన్ సరిహద్దుల్లో ఆదివారం భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.7 పాయింట్లుగా ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఇండ్లు, భవనాలు కూలిపోయాయి. టర్కీలో పరిధిలోని భూభాగంలో ఎనిమిది మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. కూలిపోయిన ఇండ్లు, భవనాల కింద ఎంత మంది చిక్కుకుపోయారన్నది ఇంకా తేలలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని, గాయపడినవారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని ప్రకటించారు.