ట్రంప్ ను విలన్ పాత్ర 'మొగాంబో'తో పోల్చుతూ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి పాత్ర మొగాంబో
- ఆ పాత్రలో 'ఖుష్ హోగయా' అనే ఫేమస్ డైలాగ్‌ను వాడే అమ్రిష్ పురి
- ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శలు
- ప్రతిపక్షాలను ఆహ్వానించలేదని వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అలనాటి బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురితో పోల్చుతూ కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ ఇండియా సినిమాలో అమ్రిష్ పురి మొగాంబో అనే పాత్రలో కనపడి 'ఖుష్ హోగయా' అనే ఫేమస్ డైలాగ్‌ను అమ్రిష్ పురి వాడుతుంటాడు.
మొగాంబో పాత్రను ట్రంప్‌తో పోల్చారు. ట్రంప్ కూడా 'ఖుష్ హోగయా' అనేందుకు భారత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పడుతుందని చురకలంటించారు. ట్రంప్ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ట్రంప్ భారత్‌కు వస్తున్నారని, అయితే ఆయన కోసం కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ డిన్నర్ పార్టీ నిర్వహించనున్నప్పటికీ ప్రతిపక్షాలను ఆహ్వానించలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ట్రంప్‌తో విందుకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అయితే, అమెరికాలో నిర్వహించిన 'హౌడీ మోడీ' కార్యక్రమంలో రిపబ్లికన్, డెమొక్రాట్లు ఇద్దరూ వేదికను పంచుకున్నారని ఆయన చెప్పారు.
భారత్‌లో మాత్రం మోదీ మాత్రమే ట్రంప్‌తో ఉంటున్నారని అధీర్ రంజన్ విమర్శించారు. తాము అమెరికాకు అధ్యక్షుడు ట్రంప్‌ను మనస్ఫూర్తిగానే స్వాగతిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికి ఉంటుందని ఆయన చెప్పారు