డొనాల్డ్ ట్రంప్ 'బాహుబలి' అయితే... వైరల్ వీడియో ... స్వయంగా స్పందించిన ట్రంప్!
- రేపటి నుంచి ఇండియాలో ట్రంప్ పర్యటన
- వీడియోను తయారు చేసిన అభిమానులు
- స్వయంగా స్పందించిన ట్రంప్
'బాహుబలి' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తే... అదే వీడియోలో ఇతర పాత్రల్లో ఇవాంకా ట్రంప్, మెలానియా తదితరులు ఉంటే... ఆ వీడియోనే ఇది. ఎవరో సృష్టించిన ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. "బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి", "ది కన్ క్లూజన్"గా వచ్చిన ఈ సినిమా భారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. సుమారు రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ సాధించి, ఇండియన్ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి పెంచింది.
ఇక రేపటి నుంచి ఇండియాలో ట్రంప్ పర్యటన ప్రారంభం కానుండగా, 'బాహుబలి' టైటిల్ సాంగ్ తో ఓ వీడియోను తయారు చేశారు. సుమారు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రభాస్, రానాల ముఖాలకు ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్ గ్రౌండ్ లో 'జియోరే బాహుబలి' పాటను జోడించారు.
ఇక ఈ వీడియోలో మెలానియా, ఇవాంకాలతో పాటు ట్రంప్ కుమారుడు కూడా కనిపిస్తున్నారు. చివర్లో 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ ట్వీట్ పై ట్రంప్ స్వయంగా స్పందిస్తూ, "ఇండియాలో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారు" అని రీ ట్వీట్ చేయడం విశేషం. ఆ వీడియోను మీరూ చూడండి.