యూపీలో 3 వేల టన్నుల బంగారం గని అబద్ధం!

  • సోన్ భద్రలో 3 వేల టన్నుల బంగారం ఉందని వార్తలు
  • కేవలం ఇనుప ఖనిజాన్ని మాత్రమే కనుగొన్నాం
  • బంగారం గని అవాస్తవమన్న జీఎస్ఐ
ఉత్తరప్రదేశ్‌ లోని సోన్‌ భద్ర జిల్లాలో 3వేల టన్నుల బంగారం నిల్వలు వెలుగులోకి వచ్చాయంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని జీఎస్ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) అధికారి ఒకరు తెలిపారు. అసలు ఆ జిల్లాలో తాము అంత బంగారం నిల్వలను గుర్తించనే లేదని జీఎస్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎం శ్రీధర్‌ వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో మీడియాకు తాము సమాచారం కూడా ఇవ్వలేదని కోల్‌ కతాలో తెలిపారు. అయితే, ఇదే జిల్లాలో జీఎస్ఐ సుమారు 52 వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని గుర్తించిందని, అందులో టన్నుకు 3.03 గ్రాముల బంగారం ఉందని తేలిందని, ఇది అత్యంత సాధారణ స్థాయని అన్నారు. ఈ సమాచారాన్నే సోన్‌ భద్ర జిల్లా అధికారులు మరోలా ఊహించి వుండవచ్చని అంచనా వేశారు.



More Telugu News