5 రోజుల దూడ పాలు ఇస్తున్న వైనం... ఉదయం లీటరు.. సాయంత్రం మరో లీటరు పాలు
- నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కొత్తలోలం గ్రామంలో ఘటన
- డైరీఫామ్లో జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే లేగదూడకు జన్మ
- దూడ పొదుగు పెద్దది కావడాన్ని గమనించిన రైతు
- ఆ పొదుగును పట్టుకుని చూడగా పాలు
లోకంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కొత్తలోలం గ్రామంలో జరుగుతున్న ఓ వింత ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహ్మద్ అజారుద్దీన్ అనే పాడిరైతుకు చెందిన డైరీఫామ్లో ఓ దూడ పాలిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితమే లేగదూడకు జన్మనిచ్చింది. ఇటీవల దూడ పొదుగు పెద్దది కావడాన్ని గమనించాడు రైతు. అనంతరం ఆ పొదుగును తడిమి చూడగా పాలు రావడం చూసి ఆశ్చర్యపోయాడు. హార్మోన్ల ప్రభావం వల్లే ఈ విధంగా జరుగుతుందని పశువైద్యాధికారులంటున్నారు.