భారత్‌ లో 'ట్రంప్ మేనియా'.. అబ్బురపర్చేలా అమెరికా అధ్యక్షుడి పెయింటింగ్‌లు, కటౌట్లు.. ఫొటోలు ఇవిగో!

  • ఈ నెల 24న భారత్‌కు ట్రంప్
  • కళాకారుల అద్భుత పెయింటింగ్‌లు
  • అహ్మదాబాద్‌ అంతా ట్రంపు బొమ్మలు
ఈ నెల 24న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పెయింటింగ్‌లు, ఫొటోలు, కటౌట్లు అలరిస్తున్నాయి.  ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ కళాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
                
అమృత్‌సర్‌కు చెందిన జగ్‌జోత్ సింగ్ రూబల్ అనే కళాకారుడు పది అడుగుల ఆయిల్ పెయింటింగ్‌ వేశాడు. 20 రోజులు కష్టపడి వేసిన ఈ పెయింటింగ్‌ను స్వయంగా ట్రంప్‌ కు ఇవ్వాలనుకున్నానని, ఇది సాధ్యం కాలేకపోతోందని చెప్పాడు.

           
                    
అహ్మదాబాద్‌లో రాసిన నినాదాలు ఇవి.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ప్రపంచంలోనే ఓల్డెస్ట్‌ డెమొక్రసీ దేశం కలుస్తోందని పేర్కొన్నారు.

      అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతూ సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలో వేసిన సైకత శిల్పం ఇది.

               
అహ్మదాబాద్‌లో బస్టాండ్లు, హోటళ్లు, రహదారుల పక్కన ట్రంప్‌, మోదీ పోస్టర్లు కనపడుతున్నాయి.


నాన్‌స్టాప్‌ కవరేజ్‌ ఇస్తామని డీడీ న్యూస్‌ హోర్డింగులు పెట్టింది.



  
    ఎయిర్‌పోర్టు నుంచి అహ్మదాబాద్‌లోని సభకు ట్రంప్‌ వచ్చే రహదారుల్లో ట్రంప్‌, మోదీల హోర్డింగులు.
     
        
అచ్చం ట్రంప్‌లా మోదీ బొమ్మ వేశాడో కళాకారుడు.. దీనికి ట్రంపేంద్ర అని పేరు పెట్టాడు.

  
అహ్మదాబాద్‌లో సిద్ధమైన వేదిక. ట్రంప్‌ పాల్గొననున్న సభపై పలువురు కళాకారులు రిహార్సల్స్‌ చేస్తున్నారు..


More Telugu News