హాస్టల్‌లో మంటలు.. మృతి చెందిన ముగ్గురమ్మాయిలు.. భవనం పైనుంచి దూకేసిన మరో అమ్మాయి
- చండీగఢ్‌లో ఘటన
- పీజీ హాస్టల్‌లో అగ్నిప్రమాదం
- మంటలు ఆర్పుతోన్న సిబ్బంది
పీజీ హాస్టల్‌లో మంటల్లో కాలిపోయి ముగ్గురమ్మాయిలు మృతి చెందిన ఘటన చండీగఢ్‌లో చోటు చేసుకుంది. సెక్టార్ 32లోని పీజీ హాస్టల్‌లో ల్యాప్‌టాప్ చార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ అమ్మాయిల వయసు 19 నుంచి 22 మధ్య ఉంటుందని, వీరు పంజాబ్, హర్యానాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వారి పేర్లు ముస్కాన్, రియా, పక్షిగా తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో ఓ విద్యార్థిని భవనం పైనుంచి కిందికి దూకేయడంతో తీవ్ర గాయాలపాలైంది.
ఆ హాస్టల్‌లో మొత్తం 36 మంది విద్యార్థులు ఉంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్ భవనంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించట్లేదని తెలిసింది.