సుక్మా ఎన్​ కౌంటర్​.. మావోయిస్టుల వద్ద బుల్లెట్​ ప్రూఫ్​ జాకెట్లు, టోపీలు!

  • సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్
  • ఎనిమిది మంది మావోయిస్టుల మృతి 
  • అత్యాధునిక గ్రెనేడ్ లాంఛర్లు కూడా లభ్యం  
‘ఆపరేషన్ ప్రహార్’లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అనంతరం సుక్మా ఏఎస్పీ సిద్దార్థ్ తివారీ సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

మావోయిస్టులు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు ధరించారని ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టులను దగ్గరగా చూసిన సీఆర్పీఎఫ్, కోబ్రా సభ్యులు తివారి దృష్టికి తెచ్చారు. భారీ సంఖ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, టోపీలు మావోయిస్టుల వద్ద ఉన్నట్టు సంబంధిత అధికారుల సమాచారం. అంతేకాకుండా, యుబీజీఎస్ అత్యాధునిక అండర్ బేరల్ గ్రెనేడ్ లాంఛర్లు కలిగి ఉన్నారని ఎదురుకాల్పుల్లో పాల్గొన్న సీఆర్పీఎఫ్, కోబ్రా దళ సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది.


More Telugu News