తెలంగాణలో గుర్తింపులేని 79 ఇంటర్ కళాశాలలకు నోటీసులు జారీ
- కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు భేటీ
- హైకోర్టు ఆదేశాల మేరకు చర్యలు
- మూడు రోజుల్లో కాలేజీలు వివరణ ఇవ్వాలి
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో గుర్తింపు లేని ఇంటర్ కాలేజీలకు నోటీసులు జారీ చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు. ఈ రోజు ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ మీడియాతో మాట్లాడి పలు విషయాలు తెలిపారు. గుర్తింపులేని 79 కళాశాలలకు నోటీసులు ఇచ్చామని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. కాలేజీల యాజమాన్యాల నుంచి స్పందన రాకుండా వాటిని మూసివేస్తామని హెచ్చరించారు.
ఈ నెల 25 తేదీ లోపు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని, కాలేజీ యాజమాన్యాలు సహకరించాలని అన్నారు. కొన్ని కాలేజీలకు అగ్నిమాపక అనుమతి లేదని, మరికొన్ని కాలేజీలకు ఓ చోట అనుమతి తీసుకుని, అదే పేరుతో అనుమతి లేకుండా మరోచోట నడుపుతున్నారని చెప్పారు.