ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టుల మృతి
- సుక్మా జిల్లాలో ‘ఆపరేషన్ ప్రహార్‘
- తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు
- ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు
ఛత్తీస్ గఢ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ’ఆపరేషన్ ప్రహార్‘లో భాగంగా సుక్మా జిల్లాలోని భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. సంఘటనా ప్రాంతాల్లో ఆయుధాలు, ఇతర సామగ్రిని సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, గత రెండు రోజులుగా సుక్మా జిల్లా కిష్టారం ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఈ నెల 18న ఒక జవాన్ ని వారు కాల్చి వేశారు. ఆ మర్నాడే మావోయిస్టుల సానుభూతిపరుడు ఒకరిని హతమార్చిన ఘటన చోటుచేసుకుంది.