అత్యవసరం అయితే తప్ప సింగపూర్ వెళ్లొద్దు: కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

  • కరోనా నేపథ్యంలో ప్రజలకు కేంద్రం సూచన
  • మరో నాలుగు దేశాల ప్రయాణికులకు స్క్రీనింగ్
  • కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి 
కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ దేశాలకు విమాన సర్వీసులు రద్దు చేసి.. పలు దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. అత్యవసరం అయితే తప్ప సింగపూర్ కు వెళ్లొద్దని సూచించింది. అంతగా ప్రాధాన్యం లేని పనుల కోసం సింగపూర్ కు ఇప్పుడు ప్రయాణం కావొద్దని శనివారం తెలిపింది.

అలాగే, దేశంలోకి కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు ఖాట్మండు, ఇండోనేసియా, వియత్నాం, మలేసియా నుంచి మన దేశానికి వచ్చే ప్రయాణికులను ఎయిర్ పోర్టుల్లో సోమవారం నుంచి స్క్రీనింగ్ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ సెక్రటరీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం చైనా, హాంకాంగ్, థాయ్ లాండ్ , దక్షిణ కొరియా, సింగపూర్,  జపాన్  నుంచి వచ్చే వారిని 21 ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు.


More Telugu News