తేజ నుంచి రెండు సినిమాలు .. హీరోలుగా రానా, గోపీచంద్
- ఈ రోజున తేజ పుట్టిన రోజు
- రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయించిన తేజ
- హీరోలుగా రానా - గోపీచంద్
మొదటి నుంచి ప్రేమకథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తేజ, ఆ తరువాత విభిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించాడు. విజయాలను స్వీకరిస్తూ .. అపజయాలను అంగీకరిస్తూ అయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ మధ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీత' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.
ఆ తరువాత ఆయన రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. ఈ రోజున తేజ పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాలకి సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు. ఒక టైటిల్ 'అలిమేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' ఈ రెండింటిలో ఒక సినిమాలో రానా .. మరో సినిమాలో గోపీచంద్ నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు.