నూజివీడు ట్రిపుల్ ఐటీలో కలకలం.. అమ్మాయిల హాస్టల్​ గదిలో ఓ రోజు గడిపిన అబ్బాయి!

  • కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ లో ఘటన
  • హాస్టల్ లోని మంచం కింద పడుకున్న యువకుడు
  • పట్టుబడ్డ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థే
విద్యార్థినుల హాస్టల్ రూమ్ లోకి ఓ యువకుడు ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడు హాస్టల్ లోని ఓ మంచం కింద పడుకుని ఓ రోజంతా గడిపాడు. ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న కళాశాల సెక్యూరిటీ సిబ్బంది, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువకుడు హాస్టల్ గదిలో ఉండేలా ఆరుగురు విద్యార్థినులు సహకరించారని ఆరోపణలు. ఈ నేపథ్యంలో ఆరుగురు విద్యార్థినులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై మిగిలిన విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం విచారణకు ఆదేశించింది.

కాగా, పట్టుబడ్డ యువకుడు కూడా ట్రిపుల్ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. హాస్టల్ కిటికీ ఊచలు విరగ్గొట్టి గదిలోకి ఆ యువకుడు ప్రవేశించాడు. కళాశాలలో రెండు రోజుల నుంచి ’ఫెస్ట్’ జరుగుతోంది. ఈ ‘ఫెస్ట్’లో విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నట్టు సమాచారం.


More Telugu News