మోదీపై ప్రశంసల జల్లు కురిపించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా
- మోదీ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి
- ఒక అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా మోదీ గుర్తింపు పొందారు
- రాజ్యాంగానికి భారత్ కట్టుబడి ఉంది
ప్రధాని మోదీ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ ప్రపంచ స్థాయిలో ఆలోచిస్తూనే, మన దేశానికి తగ్గట్టుగా పని చేస్తారని కితాబునిచ్చారు. ఒక అద్భుతమైన వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా మోదీ గుర్తింపు పొందారని చెప్పారు. మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ సమాజానికి ఒక మంచి మిత్రుడిగా భారత్ అవతరించిందని అన్నారు. ఇంటర్నేషనల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈమేరకు వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోనే భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని... ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం ఎలా కొనసాగుతోందని అందరూ ఆశ్చర్యపోతుంటారని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. రాజ్యాంగానికి భారత్ కట్టుబడి ఉందని... అందుకే ఇక్కడ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని చెప్పారు. భారత్ ఒక సురక్షిత దేశమని, ఉగ్రవాదరహిత దేశమని అన్నారు. అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న భారత్... పర్యావరణ పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. ప్రజాస్వామ్యానికి న్యాయ వ్యవస్థ వెన్నుపూస వంటిదని, శాసన వ్యవస్థ గుండె వంటిదని, పాలన వ్యవస్థ మెదడు వంటిదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈ మూడు వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, ఈ సదస్సుకి 20కి పైగా దేశాల నుంచి జడ్జిలు హాజరయ్యారు.