'కలర్ ఫొటో' పైనే సునీల్ ఆశలు

  • గట్టిపోటీని ఎదుర్కొంటున్న సునీల్ 
  • విలన్ పాత్రల పట్ల ఆసక్తి 
  • మరోసారి విలన్ గా రంగంలోకి
తెలుగు తెరపై తిరుగులేని కమెడియన్ గా సునీల్ కొంతకాలంపాటు వెలుగొందాడు. ఆ తరువాత కథానాయకుడిగా ఆరంభంలో విజయాలను అందుకున్నాడు. ఆ తరువాత పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో, కమెడియన్ గా కంటిన్యూ కావడమే బెటర్ అనుకుని వెనక్కి వచ్చేశాడు. అయితే ఆయనకి వెన్నెలకిషోర్ గట్టిపోటీ ఇస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. రవితేజ 'డిస్కోరాజా'లో సునీల్ విలన్ గా కనిపించినప్పటికీ ప్రేక్షకులు దానిని కూడా కామెడీగానే తీసుకున్నారు. ఆ సినిమా కూడా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఇప్పుడు ఆయన 'కలర్ ఫొటో' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మధ్యనే ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయమైన సుహాస్, ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఆయనకి విలన్ గా సునీల్ కనిపించనున్నాడు. విభిన్నమైన ఈ విలన్ రోల్ పైనే సునీల్ ఆశలు పెట్టుకున్నాడని అంటున్నారు. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.


More Telugu News