9 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు: బుద్ధా వెంకన్న

  • జేట్యాక్స్ వసూలు పూర్తయిందా? అని విజయసాయిని జగన్ అడుగుతుంటారు
  • మద్యానికి అలవాటు పడినవారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు
  • పీపీఏల షాక్ కు మొహం కందగడ్డలా మారింది
గత చంద్రబాబు ప్రభుత్వపాలనపై వైసీపీ ప్రభుత్వం సిట్ వేయడం రాజకీయ వేడిని అమాంతం పెంచేసింది. సిట్ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 40 ఇండస్ట్రీకి ఏమైందంటూ చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

'సాయిరెడ్డీ... జేట్యాక్స్ వసూలు పూర్తయిందా? లోడ్ ఎత్తాలి' అని జగన్ అడుగుతుంటారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం పేరుతో చెత్త కంపెనీల దగ్గర జేట్యాక్స్ వసూలు చేస్తూ... మద్యానికి అలవాటు పడినవారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. పీపీఏలను ముట్టుకుంటే కొట్టిన షాక్ కు మొహం కందగడ్డలా మారిందని అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అని అరిచినా... ఎలాంటి ఔట్ పుట్ లేకపోయేసరికి డీలా పడ్డారని చెప్పారు. 43 వేల కోట్లు కొట్టేసిన 9 ఇయర్స్ ఇండస్ట్రీకి ఏం చేయాలో పాలుపోక సిట్ వేసుకుని కూర్చున్నారని దెప్పిపొడిచారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News