మహామేత ఎన్నో విచారణలు చేయించారు.. ఇప్పుడు యువమేత ఆత్రం అర్థమవుతోంది: నారా లోకేశ్
- 9 నెలలుగా ఎంతో చేశారు.. ఏమైంది?
- ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారు
- సాధించేది ఏమీ లేనప్పుడు.. సిట్ లతో కాలక్షేపమే అవుతుంది
చంద్రబాబు ఐదేళ్ల పాలనపై వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. '''మహామేత'' అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై, 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది?
గత 9 నెలలుగా, మంత్రుల సబ్ కమిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఏమైంది?' అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని... అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి కేసులను విచారణ చేయాల్సిన అధికారులతోనని లోకేశ్ విమర్శించారు. ఇక్కడ యువమేత ఆత్రం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సాధించేది ఏమీ లేనప్పుడు... సిట్ లతో కాలక్షేపం చేయడమే అవుతుందని అన్నారు. ఈమేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. దీనికి తోడు గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు.