ఎక్కడా చూడని వింత ఆచారం ఈ శివాలయం సొంతం!
- శివుడికి సిగరెట్లతో మొక్కులు
- హిమాచల్ ప్రదేశ్ లోని లుట్రు మహాదేవ్ ఆలయంలో విచిత్రం
- శివలింగంపై సిగరెట్ ఉంచగానే వెలుగుతుందని భక్తుల విశ్వాసం
తమ కోరికలు తీరితే భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం పరిపాటి. తలనీలాలు, నగదు, నగలు ఇంకా ఇతర రూపేణా మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఓ శివాలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటారంటే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఈ విచిత్ర ఆచారం చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ వెళ్లాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలోని లుట్రు మహాదేవ్ ఆలయం ఉంది. ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరుగాంచింది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి సిగరెట్లు మొక్కుగా చెల్లిస్తారు. ఇక్కడి శివలింగంపై సిగరెట్ ను ఉంచితే దానికదే వెలుగుతుందని భక్తులు నమ్ముతారు. మొత్తమ్మీద ఈ విచిత్ర ఆచారంతో లూట్రా మహాదేవ్ ఆలయం విపరీతమైన ప్రాచుర్యం పొందుతోంది.